Devara Part-1 Glimpse - Telugu - Ntr దిమ్మతిరిగేలా చేస్తున్న ఫస్ట్ గ్లింప్స్ - Tv9

ఎదురుచూస్తున్న కొన్ని కోట్ల మంది కళ్ల సాక్షిగా..! పెట్టుకున్న వారి అంచనాలకు ఆసరాగా..! ఎట్టకేలకు! ప్రభంజనం సృష్టించేందుకే అన్నట్టు... బ్లడ్ బాత్ చేస్తూ.. బయటికి వచ్చేశాడు దేవర. రావడమేకాదు.. తన తీరేంటో.. తన కత్తికున్న పదునెంతో.. సింగిల్ గ్లింప్స్‌తో చూపించేశాడు. దేవరగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను.. పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది.