ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో వీహెచ్ భేటీ.. ఆ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని వినతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని వీహెచ్ సూచించారు. అలాగే ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించేందుకు చొరవ చూపాలని కోరారు.