ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం - Tv9

సాధారణంగా ఆటోలు, కార్లు, బస్సుల్లో ప్రయాణిస్తుంటాం. కొన్ని సార్లు బస్సులో, రైల్లో సీట్లు విరిగిపోయి ఉండటం, లేదా సీటు కుషన్‌ పాడైపోయి ఉండటం చూస్తుంటాం. కానీ, విమానంలో ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..వినడానికి వింతగా అనిపించినా నిజంగా అలాంటి ఘటనే జరిగింది..ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన నాగ్‌పూర్‌కు చెందిన సాగరిక పట్నాయక్‌కు ఊహించని షాక్‌ తగిలింది.