నేడు అంటే జానవరి 10న బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా హృతిక్ రోషన్ కు ఆయన అభిమానులు, పలువురు సినీ తారలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హృతిక్ రోషన్ 12 ఏళ్ల వయస్సులో తన సినీ జర్నీని ప్రారంభించాడు. రజనీకాంత్ నటించిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఈ సినిమాలో అతని తండ్రి రాకేష్ రోషన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి హృతిక్ తాత జె. ఓం ప్రకాష్ దర్శకత్వం వహించారు. అనతి కాలంలోనే హృతిక్ రోషన్ స్టార్ హీరోగా ఎదిగాడు.