పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు

ఓ చోట పొదల్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న కొన్ని గుడ్లు కనిపించడంతో .. అవి ఏమై ఉంటాయా అని అనుమానం వచ్చిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ సిబ్బంది అక్కడకు చేరుకొని వాటిని తీసుకెళ్లి భద్రంగా ఓ చోట ఉంచారు. కొన్ని రోజులకు వాటిలోంచి బయటకు వచ్చిన పిల్లలను చూసి అధికారులు షాకయ్యారు. కొన్నాళ్ల క్రితం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ ప్రాంతంలో స్థానికులు ఈ గుడ్లను గుర్తించారు.