తిరుమల ఘాట్‌ రోడ్‌లో రెచ్చిపోయిన యువకులు..

తిరుమల ఘాట్ రోడ్డు లో యువకుల హంగామా వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ లో వాహనం పై కెక్కి కేరింతలు కొట్టిన యువకులు విన్యాసాలు చేశారు. ఒకవైపు వర్షం కురుస్తుండగా ఘాట్ రోడ్ లో ప్రమాదకర ప్రయాణం సాగించారు.తెలంగాణ కు చెందిన TS 08 JZ 6003 వాహనం రూఫ్ టాప్ ఓపెన్ చేసి కారు 4 డోర్లు తీసి వేలాడుతూ కేకలు వేస్తూ ప్రయాణం సాగించారు. యువకుల ఉత్సాహం ఘాట్ రోడ్డులో వెళ్లే ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించాయి.