సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడాన్ని హాబీగా పెట్టుకున్నారు. సెలబ్రిటీలపై వారికి సంబంధించిన వాళ్లపై దారుణంగా బాడీషేమింగ్ కామెంట్స్ చేస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇక తాజాగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నాగమణికంఠ భార్య విషయంలోనూ కొందరు బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పర్సనాలిటీపై దారుణ కామెంట్స్ చేస్తూ.. నాగ మణికంఠ ఫ్యామిలీకి బాధను కలిగిస్తున్నారు.