ఒక్క మాటతో ట్రోలర్స్ కు అడ్డంగా దొరికిపోయిన అనసూయ.. మళ్లీ.. దబిడిదిబిడే..! - Tv9

అనసూయ..! ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, టీవీ యాంకర్‌గా, సినీ తారగా పేరు సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనసూయ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతుంది. ఇక గతంలో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన అనసూయ గత కొన్ని రోజులుగా సైలెంట్‌ అయ్యింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సమయంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెబుతూనే.. మరో కాంట్రో కామెంట్ చేసింది. ట్రోలర్స్‌ను వికార జీవులంటూ పేర్కొంది. తన మాటలతో మరోసారి నెట్టింట ట్రోలర్స్‌కు టార్గెట్ అయిపోయింది.