స్విస్ బ్యాంకులో కోట్లు వెనకేసిన వారి లిస్ట్ కేంద్రం చేతికి .. - Tv9

స్విస్‌ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి అందింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను స్విట్జర్లాండ్‌ అందజేసింది. అందులో వ్యాపారస్థులతోపాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.