కులాలు వారి ప్రేమకు అడ్డురాలేదు.. పెద్దలు పెద్దమనసుతో వారి ప్రేమను అంగీకరించారు. మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట సంతోషంగా బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లింది. తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. వధువు తీవ్ర గాయాలతో చావునుంచి తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.