ఈ విచిత్ర సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో జరిగింది.. దరఖాస్తుల స్వీకరణకు చివరిరోజు శనివారం రోజు ఈ గ్రామానికి చెందిన ఏనుగు వెంకటసురేందర్ రెడ్డి అనేవ్యక్తి శివుడి పేరిట దరఖాస్తు చేశాడు. దరఖాస్తు దారుడి పేరు శివయ్య, భార్యపేరు పార్వతీ దేవి, కుమారులు కుమారస్వామి, వినాయకుడిగా రాశాడు. అంతేకాదు దరఖాస్తు ఫామ్ మీద శివుడి ఫోటోను అంటించాడు. పుట్టిన తేదీ 12వ శతాబ్దం అని రాశాడు. అందులో మహాలక్ష్మీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు దరఖాస్తు చేసినట్లు ఉంది..