Viral భారీ మొసలిని అమాంతం భుజాలపై కెత్తుకొని.. - Tv9

ఓ వ్యక్తి కాలువలో కనిపించిన పెద్ద మొసలిని అలవోకగా భుజాన వేసుకొని వేరొక చోటికి తరలించాడు. అలా భుజాలపై మొసలిని 300 మీటర్ల దూరం మోసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. గ్రామస్తులకు మొసలి భయం తప్పించినందుకు అతడిని అందరూ ప్రశంసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.