సన్నీలియోన్ కు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్- Tv9

ముంబయిలో కనిపించకుండాపోయిన తన పనిమనిషి కుమార్తె అనుష్క దొరికిందంటూ నటి సన్నీలియోన్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసున్న ఆ పాపను వెతకడంలో సాయం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. తమ ప్రార్థనలకు సమాధానం దొరికిందని ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ఆమె ట్వీట్‌ చేసారు. ముంబయి పోలీసులకు థ్యాంక్యూ చెప్పారు. కనిపించకుండాపోయిన 24 గంటల్లోనే అనుష్క తిరిగి తమ వద్దకు చేరిందని ఆమె కోసం తాను పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.