రష్యాలో క్రిస్మస్ సీజన్ సందడి సందడిగా సాగుతోంది. క్రిస్మస్ కోసం సెయింట్ పీటర్స్ బర్ట్‌లోని ఓ దట్టమైన అడవిని అందమైన ఊహా ప్రపంచంగా తీర్చిదిద్దారు అక్కడి నిర్వాహకులు. ఫ్రోజెన్ వంటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఆ ప్రదేశాన్ని ముస్తాబు చేశారు. ఒక పక్క మంచు, పెద్ద పెద్ద చెట్లు, వాటి చుట్టూ వేలాది విద్యుద్దీపాలతో అలంకరించిన తీరు చూపరులను కట్టిపడేస్తోంది. రంగురంగుల విద్యుత్‌దీపాల వెలుగులో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు.