ప్రకాశ్ రాజ్కు బిగ్ షాక్ తగిలింది. ముచ్చటపడి కట్టుకుంటున్న ఇల్లు వివాదంలో చిక్కుకుంది. ఇది కోర్టు వరకు వెళ్లి ఆయన్న ఇరుకున పెట్టింది. దీంతో ప్రకాశ్ రాజ్ పరిస్థితి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఫ్యాన్స్ను బాధపడేలా చేస్తోంది. కొడైకెనాల్లోని విల్పట్టి పంచాయతీ పరిధిలో ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారీ బంగ్లా నిర్మాణం మొదలెట్టారు. తనకు అనుగుణంగా.. వెరీ లావిష్గా బంగ్లాను నిర్మించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ఈ విషయంపై.. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. కొండ ప్రాంతంలో... నిబంధనలకు విరుద్దంగా.. ప్రకాశ్ రాజ్ బంగ్లా నిర్మాణం చేపట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ప్రకాశ్ రాజ్ సెలబ్రిటీ కావడంతో... ప్రభుత్వ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లింది.