చాలా కాలం తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు వెంకీమామ. హిట్ యూనివర్స్‌తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మ కీలకపాత్రలలో నటించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది.