మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్న మహిళ..ఆనందంలో వేదికపైనే.. - Tv9

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తోందో తెలియదు. కడు నిరుపేదలను సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసేస్తుంది. తాజాగా అమెరికాలో ఓ మహిళకు అలాంటి అదృష్టమే పట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకుంది. నిర్వాహకులు ఆ విషయం ప్రకటించగానే ఆనందం తట్టుకోలేక అమాంతం స్టేజిపైన పడిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.