అమ్మో....ఎంత పెద్ద కొండచిలువో... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, డోంకురు గ్రామంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన సంగారు.గంగయ్య, బుడగొట్లు పొలంకు అడవి పందుల నుండి రక్షణకు వల వేయగా దానికి భారీ కొండచిలువ చిక్కింది.