తీర్థం పేరుతో నోట్లో యాసిడ్.. 11మందిని చంపేసిన తాంత్రికుడు ! Nagar Kurnool Fake Baba Latest News-tv9

ఎట్టకేలకు ఓ నరరూప రాక్షసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11మందిని పొట్టనబెట్టుకున్నాడు దుర్మార్గుడు. అత్యంత దారుణమైన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం, ఎవరైనా ఎదురు తిరిగితే మట్టుబెట్టడం, ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్‌. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ యాదవ్ అమాయకులైన ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు. తన మంత్రశక్తితో గుప్త నిధులను వెలికితీస్తానని నమ్మబలికాడు.