అవసరానికి తగినట్టుగా అప్పటికప్పుడు జుగాడ్ లు సృష్టించడం భారతీయులకే చెల్లింది. ఓ గిరిజన యువకుడు సృష్టించిన జుగాడ్ తన నానమ్మ పాలిట రోల్స్ రాయిస్ కారులా మారింది. అవును నడవలేని, కనీసం కూర్చుని ఎక్కువ దూరం ప్రయాణించలేని స్థితిలో ఉన్న తన నానమ్మను బ్యాంకుకు తీసుకెళ్లడం కోసం ఆమె మనవడు పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది. వృద్ధాప్యంలో ఆ వృద్ధురాలికి అండగా నిలిచిన యువకుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.