యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ క్రేజ్ పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెర దించాడు నీల్. ఇప్పటివరకు అభిమానులు ఊహించని రేంజ్లో ప్రభాస్‍ను చూపించి సర్ ప్రైజ్ చేశాడు నీల్.