ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ విలాసవంతమైన జీవనశైలికి, అద్భుతమైన దుస్తులకు, ఖరీదైన వాచీలకి, క్వీన్ సైజ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. ఆమె వద్ద సాదాసీదా వస్తువులు లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన నీతా అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా తరచుగా వార్తల్లో ఉంటారు. ఆమె రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా సాధారణ విషయాలు కాదు.