ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇమ్రాన్ హష్మీకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ మూవీలో లిప్ లాక్ సీన్ ఉండడంతో.. ఆ హీరోకు సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు అడియన్స్. లిప్ లాక్ సీన్స్ ద్వారానే ఇమ్రాన్ హష్మీ చాలా పాపులర్ అయ్యాడు. అలాగే అతడి సినిమాల్లోని చాలా సాంగ్స్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఇమ్రాన్ హష్మీని.. ఆ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్స్ వెంటాడాయి. అతడు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ హీరో.. ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నాడు.