వీరు మాత్రం హలీమ్‌ తినకూడదంట! వీడియో

హైదరాబాద్‌లో హలీం ఓ సంస్కృతిగా మారిందని చెప్పొచ్చు. రంజాన్ సీజన్‌లో దీనికి ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఈ సీజన్‌లో హలీం టాప్ స్పాట్‌గా ఎన్నో రెస్టారెంట్లు పేర్లను హైదరాబాద్‌లో చెప్పేయవచ్చు . హలీం తినడానికి ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో జనం వస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా ఈ హోటల్స్‌ ఫేమస్ అయ్యాయి. అంతే కాదు.. ఇక్కడి రుచి కూడా తిన్నవారిని మైపరిపిస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం హలీమ్‌ తినకూడదు ! హైదరాబాద్‌లో రంజాన్ సంబరాలు హలీం లేకుండా పూర్తవ్వవు. ప్రతి సంవత్సరం.. హలీం ప్రియులు ఏ హోటల్‌లో హలీం బెస్ట్ అన్నదానిపై చర్చించుకుంటారు.