శ్రీశైలంలో అభిషేకాలు నిలిపివేత.. ఎందుకంటే.. - Tv9

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు.. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి రేపటి నుంచి మూడురోజులపాటు అనుమతించనున్నట్లు చెప్పారు. టికెట్లు దేవస్థానం వైబ్​సైట్​‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.