పోలింగ్ డేట్ దగ్గరపడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, సభలతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ తరుణంలో అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారపర్వంలో పాల్గొంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.