Gold Tax బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం!

కేంద్ర ప్రభుత్వం బంగారంపై పన్ను నిబంధనలను మార్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది జూలైలో 2024-25 కోసం పూర్తి బడ్జెట్‌ను సమర్పించినప్పుడు మూలధన లాభాల పన్నుకు సంబంధించిన రూల్స్‌ ను మార్చారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పొందని వారు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.