డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్

అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యావద్.. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ సిటీలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. భారత్‌లో పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఇతడిని.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌యే చంపింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. అలాగే అతడిని ఎక్కడ, ఎలా చంపారో వివరించడంతో పాటు ఎందుకు చంపారో కూడా బయటపెట్టింది.