ప్రకృతిలో మానవాళితోపాటు పశుపక్ష్యాదులు కూడా జీవనం సాగిస్తున్నాయి. వీరి జీవన విధానంలో పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి సాగుతుంది. అవును పశుపక్ష్యాదులు ఉంటేనే మానవాళి మనుగడ ముందుకు సాగుతుంది. అందుకే అనాదికాలం నుంచి మనిషికి జంతువులకు మధ్య అవినాభావ సబంధం ఉంది. ఈక్రమంలోనే పెట్స్ రూపంలో శునకాలు, ఆవులు, ఇతర జంతువులు మనిషితో కలిసి జీవిస్తున్నాయి. చాలామందికి మూగజీవులంటే చాలా ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావించి ప్రేమను పంచుతారు. కొందరు మాత్రం మూగజీవుల పట్ల తమ పైశాచికాన్ని చూపిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కోతికి ఆహారం అందిస్తూ ఉన్నట్టుండి కోతిపై దాడి చేసాడు.