ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అనే మాట వింటే ముందుగా గుర్తొచ్చేది విందు భోజనాలు. సాధారణంగా ఏ శుభకార్యాలలోనైనా ముందుగా భోజనాలు ఎలా ఉన్నాయి. వెరైటీలు ఏంటి అనే టాక్ వినిపిస్తుంది. అలాంటిది ఎంతో రుచికరమైన భోజనాలు పెడితే అలాంటి వారిని ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా రుచికరమైన భోజనాలు ప్రత్యేకంగా వివాహలు, ఇతరత్రా శుభకార్యాల్లో మాత్రమే పెడుతుంటారు. కానీ అక్కడ నిత్య అన్నదాన సత్రంలో మాత్రం ప్రతిరోజు అక్కడకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి రుచికరమైన ఎన్నో వెరైటీలతో కలిగిన భోజనం అందిస్తున్నారు. అంత రుచికరమైన భోజనాలు సైతం ఉచితంగా పెడుతున్నారంటే మీరు నమ్ముతారా..! కానీ అది నిజం.. నిత్యం అక్కడికి వచ్చిన భక్తులకు వెరైటీలతో నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా ప్రసాదం రూపంలో అందిస్తున్న నిర్వాహకులను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.