హత్య చేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈగలు కారణంగా అతను పోలీసులకు దొరికిపోయాడు. అదెలా అనుకుంటున్నారా? మధ్యప్రదేశ్ జబల్ పూర్ జిల్లాలోని తప్రియా గ్రామంలో అక్టోబరు 30న ఓ హత్య జరిగింది. పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ ఠాకూర్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఊరు చివరనున్న పంట పొలాల్లో మనోజ్ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు.