తన వాయిస్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సింగర్ సునీత. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ పాడి అలరించారు సునీత. తన వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను, యాంకర్ గాను తన ప్రతిభను చాటుకున్నారు సునీత. ఇక ఇప్పుడు సునీత కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో ఆకాష్ హీరోగా నటించాడు. సర్కారు నౌకరి సినిమా జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గంగామోని శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కిన సర్కారు నౌకరి సినిమా ప్రేక్షకులను మెప్పించింది.