బాహుబాలి తర్వాత సలార్ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు నీల్. ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు.