అయోధ్యరాముడు భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరి 22 న ప్రధాని మోదీ చేతులమీదుగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యలో రాముని దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. అన్ని విధాలుగా రవాణావ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనుంది.