కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో ప్రయోగం...పీఎస్ ఎల్ వీ-సీ58 కౌంట్ డౌన్ షురూ @Tv9telugudigital

చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాలలో దూసుకుపోతోంది. 2023 విజయపరంపరను.. కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలనే దృఢ సంకల్పంతో నూతన సంవత్సరం తొలిరోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV-C58 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ షురూ చేసింది. ఈ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి, సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.