మేనరికపు పెళ్లిళ్లు..కన్నీటి వ్యధలు - Tv9

పార్వతీపురం మన్యం జిల్లా పాంచాలి అనే గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంట్లో మేనరికం పెళ్లిళ్లు జరగడం సంప్రదాయం. అక్కడ వివాహాలు బయట గ్రామాల వారితో కాకుండా అదే గ్రామంలోని వారితో జరుగుతాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే తమ ఆడపిల్లను మేనమామ లేదా మేనత్త కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వయాన బావ, మరదలు లేని పక్షంలో మరొక సమీప బంధువుతో మేనరిక వివాహాలు జరిపిస్తారు.