రష్యా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాలకు, మరణాలకు మధ్య భారీ వ్యత్యాసం కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోయింది. దీనికి తోడు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రాణనష్టం భారీగా సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో జననాల రేటు పెంచేందుకు సెక్స్ మినిస్ట్రీ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.