తమిళనాడును వణికిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.