వర్షాలు ప్రారంభం కాగానే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురుకి వజ్రాలు దొరికినట్లు.. వాటిని భారీ రేటుకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పుడూ జరిగేదే.. తాజాగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి జనాలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. తీరానికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయన్న ప్రచారం స్థానికంగా జోరందుకోవడంతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడి వచ్చి.. బంగారం కోసం అన్వేషిస్తున్నారు.