హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా... మార్కెట్ లెక్కలను అసలు పరిగణలోకే తీసుకోకుండా... తన పాటికి తాను సినిమాలు చేసుకుంటూ పోయే మంచు విష్ణు.. ఈ సారి మాత్రం ఓ భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఆసినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా తన బర్త్ డే సందర్భంగా... ఆ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి.. అందరికీ దిమ్మతిరిగేలా చేశారు.