రాయి నైనా కరిగించగల శక్తి సంగీతానికి ఉందని అంటారు.. సంగీతానికి సప్త స్వరాలే ప్రాణం. అలాంటి సప్త స్వరాలు వీణ నుంచి వస్తే ఆ మాధుర్యమే వేరు. సంగీతాన్ని ఆస్వాదించడానికి ఎన్నో సాధనాలు ఉన్నా వీణ ద్వారా వచ్చే శ్రావ్యమైన సంగీతం ఎంతో ఆనందాన్ని, హాయిని ఇస్తుంది. వీణా గానం నుండి వచ్చే సప్త స్వరాల శబ్దం సంగీత ప్రియులను తన్మయత్నం పొందేలా చేస్తుంది. సరస్వతీదేవీ ఒడిలో సరిగమలను వీణ పలుకుతుంది. అలాంటి విశిష్టత కలిగిన వీణల తయారీకి నూజివీడు పెట్టింది పేరు.. ఇప్పటికే వీణల తయారీలో నూజివీడు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.