కాళ్లు బయట.. బాడీ లిఫ్టులో... గంట సేపు నరకయాతన - Tv9

నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో మహేందర్ గౌడ్ అనే సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. రెండు కాళ్లు బయట లిఫ్ట్ లోపల మిగిలిన శరీరం ఉండిపోయి చిక్కుకొని గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు మహేందర్‌. ఫైర్ స్టేషన్ రెస్క్యూ టీం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు.