గుంటూరులో సెల్ ఫోన్ దొంగల సరికొత్త ప్లాన్ - Tv9

దొంగలు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు. స్మార్ట్‌ యుగంలో ఇస్మార్ట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. గుంటూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, ఒంటరిగా ఎవరైనా దొరికితే చాలు వారి ప్లాన్‌ అమలు చేసి తెలివిగా సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. ఇటీవల స్మార్ట్‌ ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా అందుబాటులోకి వచ్చాయి. వాటి ధరకూడా బాగానే పలుకుతుండటంతో దొంగలు సెల్‌ఫోన్లపై కన్నేశారు.