తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.