చిన్న హోటల్‌కు సామాన్యుడిలా అసదుద్దీన్‌ ఓవైసీ.. ఏం తిన్నారో తెలుసా?

హైదరాబాద్‌ పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మీరాజ్‌తో కలిసి ఆలిండియా మజ్లిస్‌ ఇ ఇత్తెహాదుల్‌ ముస్లీమిన్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ లంచ్‌ చేశారు. హైదరాబాద్‌ బిర్యానీకి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందనే విషయం తెలిసిందే. ఎవరైనా టూరిస్టులు హైదరాబాద్‌కు వచ్చారంటే బిర్యానీని టేస్ట్‌ చేయకుండా వెళ్లరు. తాజాగా ఓ చిన్న హోటల్‌లో ఎంఐఎం అధినేత బిర్యానీ తినడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాతబస్తీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అసదుద్దీన్‌.. స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, మరో వ్యక్తితో కలిసి బిర్యానీ తిన్నారు. అది కూడా ఒకే ప్లేట్‌లో ముగ్గురు కలిసి భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.