తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఎండ్ టూ ఎండ్ మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద తప్ప మిగాతా స్టేసన్స్ ఖాళీలుగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో స్టేషన్స్ నుండి ఆఫీస్ లకు మహిళలు ఆర్టీసీ ప్రీ జర్నీని వాడుకుంటున్నారు. ఆర్టీసీల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, ఆ ఎఫెక్ట్ కొంత మెట్రో రైళ్లపై కనిపిస్తోంది. లాంగ్ జర్నీ చేసే వాళ్లు తప్ప ఎక్కువ మంది ఆర్టీసీ ఫ్రీ సర్వీస్‌లను వాడుకుంటున్నారు.