ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో...ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు... విరహ దాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది. అప్పుట్లో ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా ఆరోరా విషయంలో..! అందుకే తన కంటే వయసులో పెద్ద, ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించిన అర్జున్ కపూర్... ఇన్నాళ్ల ప్రేమింగ్.. డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. బాలీవుడ్ మీడియా వారు ఇదే అంటున్నారు.