ఇజ్రాయెల్ సైనికులు మానవత్వం మంటగలిసేలా అమానవీయంగా ప్రవర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఓ పాలస్తీనా పౌరుడిని మిలటరీ వాహనం బ్యానెట్‌కు కట్టేసి, చిన్నపాటి సందుల గుండా తీసుకెళ్లారు. ఈ ఘటన పాలస్తీనా వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది.