పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న..!

ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీపై మంచి హైప్ ఉంది. ఇంతకు ముందు పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు మేకర్స్.