తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..? ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేది తామంటే తామేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. తెలంగాణలో 13 నుంచి 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనావేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా బీజేపీ 12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.